ఇట్స్ అఫీషియల్ – ‘డీజే’ ఖాతాలో మరో రికార్డ్!

Duvvada Jagannadham Official Mobile Appసినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడంలో “దువ్వాడ జగన్నాధమ్” సక్సెస్ అయ్యాడు. ‘బాహుబలి 2’ ద్వారా పెరిగిన మార్కెట్ ను వినియోగించుకోవడంలో ‘డీజే’ విజయవంతం కావడంతో, చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీలో ఉంది. బన్నీ గత చిత్రం ‘సరైనోడు’ మాదిరే ఏపీ, తెలంగాణాలలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, మిగతా ప్రాంతాలలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఓవర్సీస్ లో అయితే అతి కష్టం మీద 1 మిలియన్ సాధిస్తాడేమో గానీ, అయినప్పటికీ నష్టాలనే మిగల్చనున్నాడు.

అయినప్పటికీ ఓవరాల్ గా ‘నాన్ బాహుబలి’ రికార్డులను కొట్టేస్తుందన్న అంచనాలతో చిత్ర యూనిట్ ఉంది. ఇది తేలాలంటే ఇప్పుడే తేలే విషయం కాదు గానీ, ఈ ‘డీజే’ ఖాతాలో మరి రికార్డ్ మాత్రం వచ్చి చేరింది. ఇటీవల ఈ సినిమా మొబైల్ యాప్ ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో ఒక లక్ష డౌన్ లోడ్స్ చేసుకున్న ‘మూవీ యాప్’గా ‘డీజే’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ దీనికి సంబంధించి ఒక అధికారిక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories