ఇది రికార్డులు బ్రేక్ చేసే ట్రైలరా?

Duvvada Jagannadham Trailer Talkహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దిల్ రాజు నిర్మిస్తున్న 25వ సినిమాగా తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. టైటిల్ రోల్ పోషిస్తున్న అల్లు అర్జున్ క్యారెక్టర్ హైలైట్ గా నిలిచిన ఈ ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా, రొటీన్ మాస్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిందన్న విషయాన్ని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

నిజానికి ఈ ట్రైలర్ ముందు వరకు ఏదో ఓ కొత్త తరహా కధతో ‘దువ్వాడ జగన్నాధమ్’ చిత్ర యూనిట్ ప్రేక్షకులను పలకరించబోతుందన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. కానీ, ట్రైలర్ విడుదల తర్వాత మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే! దిల్ రాజు – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సన్నివేశాలు అక్కడక్కడ తళుక్కుమనిపించగా, బన్నీ స్టైలిష్ గెటప్ మాత్రం ఫ్యాన్స్ కు కిక్ ను పంచుతోంది.

ADVERTISEMENT

సాధారణంగా భారీ హైప్ తో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతుంటాయి. కానీ ‘దువ్వాడ’ సినిమాకు ఆ అవకాశం లేకుండా, ఇప్పటివరకు ఉన్న అంచనాలను పూర్తిగా తగ్గించడంలో ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. మరి ఈ తరహా సాధారణ కధతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే సత్తా బన్నీకి ఉందా? ఒక విధంగా అల్లు అర్జున్ రేంజ్ ను పరీక్షించే సినిమాగా దీనిని పేర్కొనవచ్చు.

వరుసగా సమ్మర్లో కమర్షియల్ సక్సెస్ లు కొడుతున్న బన్నీ, జూన్ 23వ తేదీన “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని టెస్ట్ చేయబోతున్నాడు. మరి మునుపటి సినిమాల రికార్డులను బద్దలు కొట్టే స్థాయి ఈ ట్రైలర్ కుందా? రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటే… ‘కాటమరాయుడు’ ద్వారా పవన్ నే తిరస్కరించిన ప్రేక్షకులు బన్నీని అక్కున చేర్చుకుంటారా? వెయిట్ అండ్ సీ..!

ADVERTISEMENT
Latest Stories