పాట మెలోడీ అయినా, ఫాస్ట్ బీట్ అయినా చిత్రీకరణ హాట్ హాట్ గా ఉంటే గనుక, అవి కావల్సినంత పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నాయని ‘ఆర్ఎక్స్ 100’ వంటి సినిమాలు నిరూపించాయి. దీంతో ఈ కోవలోనే మరిన్ని చిన్న సినిమాలు హాట్ హాట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా “ఈ మాయ పేరేమిటో” సినిమాలో తాజాగా విడుదల చేసిన ‘సూర్యుడికే నేరుగా’ అన్న పాట నిలుస్తోంది.
ADVERTISEMENT
[m9ad]
మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట రాహుల్ విజయ్, కావ్య తాపర్ లపై రొమాంటిక్ గా చిత్రీకరించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి పాటలు వర్కౌట్ అవుతాయేమో గానీ, సినిమాలో మ్యాటర్ లేకపోతే ఇంతకంటే హాట్ హాట్ గా షూట్ చేసినా ప్రయోజనం లేదని చెప్పడానికి బోలెడన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. మరి “ఈ మాయ పేరేమిటో” మూవీ ఏ జాబితాలో చేరుతుందో అతి త్వరలోనే తెలియనుంది.
ADVERTISEMENT



