ట్రైలర్ టాక్ – మళ్ళీ అదే విశాఖపట్టణం… 2018..!

Ee Maya Peremito Trailer Talkనాగచైతన్య టీజర్ విడుదల చేయడం… నాని వాయిస్ ఓవర్ చెప్పడం… జూనియర్ ఎన్టీఆర్ ఆడియో వేడుకకు విచ్చేయడం… ఇలా స్టార్ హీరోలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన “ఈ మాయ పేరేమిటో” ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు ఈ స్టార్ హీరోల పబ్లిసిటీ అవసరమా? అనిపించక మానదు.

[m9ad]

ADVERTISEMENT

పరమ రొటీన్ లవ్ స్టోరీలా కనపడుతున్న ఈ ట్రైలర్ నాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. నాటి ‘మరోచరిత్ర’ సినిమాతో పోలుస్తూ… మళ్ళీ అదే విశాఖపట్టణం 2018… అంటూ నాని చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ప్రారంభమైన ట్రైలర్ అంతా రొటీన్ గా సాగుతూ చివరికి నాని చెప్పిన టైటిల్ తో ముగుస్తుంది.

ఇందులో నాని వాయిస్ ఓవర్ తప్ప మిగతావన్నీ సోసోగానే ఉన్నాయి. చిత్ర హీరోహీరోయిన్లు మినహాయిస్తే మిగతా తారాగణం రాజేంద్రప్రసాద్, మురళీశర్మలు ఉండడం ప్లస్ పాయింట్ కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం చెప్పుకోదగ్గ అంశం. కొప్పుల రాము దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయనున్నామని డిక్లేర్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories