టాప్ 10లో అంతేగా… అంతేగా…!

F2 – Fun and Frustration Blockbuster fourth weekఈ సంక్రాంతికి వచ్చిన ‘కధానాయకుడు, వినయ విధేయ రామ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరుత్సాహాన్ని గురిచేయగా, సోలో హిట్ గా “ఎఫ్ 2” చెలరేగిపోతోంది. నెమ్మదిగా మొదలైన “ఎఫ్ 2” ప్రస్థానం, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 10 హిట్స్ లో ఒకటిగా నిలిచిందంటే, ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ ఉందొ అవగతం చేసుకోవచ్చు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతుండడంతో, ఫైనల్ గా మరో మూడు, నాలుగు స్థానాలు పైకి వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నది ట్రేడ్ టాక్.

ADVERTISEMENT

దీంతో సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తదుపరి స్థానంలో విక్టరీ వెంకటేష్ కు స్థానం లభించినట్లయింది. అలాగే కమర్షియల్ గా మాంచి సక్సెస్ కోసం వేచి చూస్తున్న మెగాహీరో వరుణ్ తేజ్ కు ఈ విజయం ఊరటనిచ్చింది. చాలాకాలం తర్వాత ఓ కామెడీ ఎంటర్ టైనర్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలుతుండడంతో, ‘ఎఫ్ 2’ ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది. దీంతో భవిష్యత్తులో కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్స్ క్యూలు కట్టనున్నాయా? అంటే… “అంతేగా… అంతేగా…!” అన్న సమాధానమే మిగులుతుంది.

ADVERTISEMENT
Latest Stories