టాలీవుడ్ లో మెగా హీరోల హవా కొనసాగుతున్న తరుణంలో వరుణ సందేశ్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూపోతున్నాడు . అయితే ఈ క్రమంలోనే హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది. అటి అని కాస్త క్లుప్తంగా వివరాల్లోకి వెళితే మనం ముందు చెప్పుకునట్లుగా గానే సంక్రాంతి సందడిలో రెండు పెద్ద సినిమాలు, ఎన్టీఆర్ బయో పిక్, మరొకటి చెర్రీ వినయ విధేయ రామ ఉన్నాయి.
[m9ad]
అయితే ఇలాంటి హోరా హోరీలో బరిలోకి దిగి చిన్న సినిమాలతో హిట్ కొట్టడం దిల్ రాజుకి అలవాటు అయిన పనే. మన ఇప్పటికే చూశాంగా మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నం150, బాలయ్య గౌతామీ పుత్ర శాతకర్ణి బరిలో చిన్న సినిమా అయినా ‘శతమానం భవతి’ని దింపి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో మారు అదే సాహసం చెయ్యనున్నాడు దిల్ రాజు ఒక పక్క రెండు బడా సినిమాలు ఉన్నా వరుణ్ తేజ-వెంకటేష్ మల్టీ స్టారర్ ‘ఎఫ్-2’ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచుతున్నాడు. అయితే ఈ కధ అంతా పాత కధే కానీ, ఒకవేళ ఇదే జరిగితే వరుణ్ కరియర్ కి కాస్త ఇబ్బంది కర పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 21న వరుణ్ తేజ అంతరిక్షం వస్తుంది. అయితే ఆ సినిమా విడుదల అయ్యింది రెండు-మూడు వారాలు గడవక ముందే మరో సినిమా వస్తే వరుణ్ అంతరిక్షం సినిమాకు ఇబ్బందులు తప్పవు. అసలే ఆ సినిమా వరుణ్ కి తొలి ప్రయోగాత్మక సినిమా అని చెప్పవచ్చు. పైగా రెండు సినిమాలు రెండు వేర్వేరు జోనార్స్ లో వస్తున్న సినిమాలు.
ఇదిలా ఉంటే ఇక్కడ ఇంకో గమ్మత్తు అయిన విషయం ఏంటి అంటే, ఈ సినిమా గురించి పెద్దగా బజ్ లేకపోవడం, పైగా ఇప్పటివరకూ ఈ సినిమా ఫర్స్ట్ లుక్ తప్ప, ఇంకేమి తెలియకపోవడం. మ్యాటర్ చూస్తూ ఉంటే ఈ సినిమా వాయిదా పడితేనే బెటర్ అన్నట్లుగా ఉంది, కానీ ఇలాంటి క్రేజీ మల్టీ స్టారర్ ని అంత ఈజీగా దిల్ రాజు వాయిదా వేస్తాడు అని అనుకోలేం. చూద్దాం మరి ఏం జరగబోతుందో.



