“ఎఫ్- 3 ” కూడా వస్తుంది…సిద్ధమా!

F2 -Fun and Frustration - sequelసంక్రాతి బరిలో నిలిచిన పెద్ద సినిమాలలో ఎఫ్- 2 బాక్స్ ఆఫీస్ ను దంచి కొడుతోంది. ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. పండగ బరిలో ముందుగా ఈ సినిమానే చూడడానికి సిద్దపడుతున్నారు ప్రేక్షకులు.

ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఎఫ్ 2 దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత స్తానం రజని కాంత్ పేటకి దక్కగా, ఆ తర్వాత ఎన్ఠీఆర్ సినిమా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉన్న కామెడీకి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని, ఈ సినిమాకి వరుసగా సిరీస్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావి పూడి. హాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉంది. ఇప్పుడు ఆ ట్రెండ్ ను తెలుగులో కూడా తీసుకు రావాలి అన్నది అనిల్ రావి పూడి.

ADVERTISEMENT

అయితే ఇప్పటికే దీని గురించి అటూ వెంకీ, ఇటూ వరుణ్ తో అనిల్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా సిరీస్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఎఫ్-2 తర్వాత వచ్చే ఎఫ్-3 ఇంకెన్ని నవ్వుల పువ్వులు పోయిస్తుందో చూడాలి. ఏది ఏమైనా…ఇదే జరిగితే తెలుగులో సరికొత్త ట్రెండ్ మొదలయ్యినట్లే.

ADVERTISEMENT
Latest Stories