ఆ రెండు దుమ్ము దులుపుతున్నాయి…ఆ ఒక్కటి తప్ప!

F2 – Fun and Frustrationఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు ఎలా ఉంటాయి అన్నది అందరికీ సస్పెన్స్ గా మిగిలిన మ్యాటర్. అయితే ప్రతీ సినిమా తమ తమ ట్రయిలర్స్ తో పోస్టర్స్ తో దుమ్ము దులిపేస్తుంది అనే చెప్పాలి.

[m9ad]

ADVERTISEMENT

ముఖ్యంగా ఎఫ్-2 పేరుతో వెంకీ-వరుణ్ చేస్తున్నహంగామా అంతా ఇంతా కాదు…మరో పక్క తాజాగా ఎన్ఠీఆర్ సినిమా ట్రైలర్ కూడా బయటకు వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే..ఎన్ఠీఆర్ దిగి వచ్చి బాలయ్య రూపంలో దర్శనం ఇచ్చాడా? అన్న విధంగా ఉంది ఆ ట్రైలర్…ఇక ఈ రెండు ట్రైలర్స్ తో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరో పక్క సంక్రాతి బరిలో నిలిచిన మరో సినిమా చెర్రీ వినయ విధేయ రామా…ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి హైప్ ఇవ్వగా…పాటలు మాత్రం పాత వాసనను చూపిస్తూ నీరసాన్ని తెప్పించాయి. అయితే ఈ సినిమా ట్రయిలర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు..

మరి ఆ ట్రైలర్ కూడా వచ్చేస్తే ఇక అందరికీ సంక్రాతి అనేది మరోసారి సినిమా పండగ అవుతుంది అన్న మాట. చూద్దాం మరి చెర్రీ ఎలా వస్తాడో..!

ADVERTISEMENT
Latest Stories