పవన్ గారు మళ్ళీ పాత కథేనా?

family donations to Pawan Kalyan janasena పవన్ కళ్యాణ్ జనసేన పై చాలా ఆశలే పెట్టుకున్నారు ఆయన అభిమానులు, పార్టీకి మద్దతుగా నిలుస్తున్న కార్యకర్తలు. అయితే పవన్ మొదటి నుంచి ఎన్నాళ్ళు ఈ కుటుంభ పాలన అంటూ…సరికొత్త ప్రపంచం నిర్మిద్దాం అంటూ..పాత మొహాలను తోలేద్దాం అంటూ నినాదాలు చేస్తూ..దాన్నీ పార్టీ నినాదంగా చేసేసారు.

ADVERTISEMENT

[m9ad]

అయితే పవన్ విజన్ బావుంది…కానీ పవన్ ఆలోచనతో ఆచరణ ఏకీభవించను అంటుంది, దానికి గల కారణం ఏంటి అంటే…పవన్ చెప్పిన దాని ప్రకారం పాత ముఖాలు కాకుండా..కొత్త ముఖాలతో పార్టీ ముందుకు సాగాలి అన్నాడు…కట్ చేస్తే పాత తరం ఫేడ్ అవుట్ అయిపోయిన నాయకులను తన పార్టీలోకి ఎదురెళ్లి మరీ రమ్మంటున్నాడు.

ఇక అన్నయ్యతో విభేదించా అంటూ ఎప్పటికప్పుడు చెబుతున్న పవన్…ఇప్పుడు అదే అన్నయ్య తన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు అన్న వార్తలు వినిపిస్తుంటే కనీసం వాటిని ఖండించే ఆలోచన కూడా చెయ్యడం లేదు. ఇక మరో పక్క మొన్నటి వరకూ చిరును ఆధారంగా చేసుకుని పవన్ ని ఒంటరి వాడిని చేసిన నాగబాబు ఫామిలీ ఇప్పుడు అదే పవన్ పార్టీకి భారీగా విరాళం ప్రకటించింది.

మరి మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ పార్టీ కూడా కుటుంభ పార్టీగానే ముద్ర పారిపోవడానికి చాలా పోలికలే కనిపిస్తున్నాయి. మరి పవన్ వీటన్నింటినీ ఛేదిస్తాడో…లేక షరా మామూలుగా రాజకీయ నాయకుడిలాగా “లెట్స్ ప్రోసీడ్” అంటాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories