టీజర్ టాక్ – నటులే మారారు, స్టోరీ కాదు!

fashion-designer-so-ladies-tailor-teaser-talk‘ఫస్ట్ లుక్’ అంటూ విడుదల చేసిన పోస్టర్ వివాదాస్పదం కావడంతో “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” సినిమాకు కావలసినంత పబ్లిసిటీ వచ్చింది. సెన్సార్డ్ భాగాలపై హీరోయిన్ కొలతలను కొలిచే విధంగా ఉన్న ఈ పోస్టర్ పై మంచు లక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేయడం, దీనికి పలువురు హీరోయిన్లు మద్దతు తెలపడం వంటి సంఘటనలు తెలిసినవే. అయితే ఆ తర్వాత మణిశర్మ స్వరపరిచిన ఆడియోలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ, శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నాడు సూపర్ హిట్ అయిన ‘లేడీస్ టైలర్’ సినిమా కధ చూసిన ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ‘జతజడల మధ్యలో జమజజ్జ’ అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన సందడికి సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తనకు ‘లక్’ తెచ్చిపెట్టే భామ కోసం పుట్టుమచ్చలు వెతికిన నటకిరిటీ చేసిన అల్లరి చేష్టలు ఆకట్టుకున్నాయి. అయితే ఇన్నేళ్ళు గడిచినా ఇదే ‘కాన్సెప్ట్’ను దర్శకుడు వంశీ తన తాజా చిత్రంలో చూపించబోతున్నారన్న అనుభూతిని ఫస్ట్ టీజర్ కలిగించింది.

ADVERTISEMENT

నాడు ‘పుట్టుమచ్చ’ స్థానంలో నేడు ‘మన్మధ రేఖ’ వచ్చి చేరినట్లుగా కనపడుతోంది. అది మినహాయిస్తే… టీజర్ లో చెప్పుకోవడానికి ఏం లేదు. సుమంత్ అశ్విన్ చెప్పిన డైలాగ్ డెలివరీలో మార్పు రావడంతో, దానిని వినడానికి కూడా ప్రేక్షకులు మానసికంగా సిద్ధం కావాల్సి ఉంది. వంశీ దర్శకత్వం వహించే సినిమాలలో డైలాగ్స్ ‘యాక్సెంట్’ వేరే రకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరహా డైలాగ్ డెలివరీ సుమంత్ అశ్విన్ కు అంతగా సూట్ కాలేదన్న సంకేతాలను టీజర్ ఇచ్చింది.

ADVERTISEMENT
Latest Stories