‘1 నేనొక్కడినే’ సినిమా పోస్టర్ పై సమంత కామెంట్ చేసినట్లుగా, ఇటీవల విడుదలైన ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై మంచు లక్ష్మి కామెంట్ చేయడం, దానిని టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సమర్ధించడం తదితర సంగతులు తెలిసినవే. అయితే సదరు ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లో హీరో, హీరోయిన్ల ముఖాలు కనపడకుండా విడుదల చేయడంతో, ఆ కొలతలు ఏ హీరోయిన్ వన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ, తాజాగా ఆ ఫోటో ఫుల్ పోస్టర్ విడుదల కావడంతో, సదరు హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.
తొలి సినిమానే పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ దక్కించుకుందని ప్రచారం జరిగి, ఆ తర్వాత అనుకోని కారణాలతో పవన్ పక్కన నటించే అవకాశం మిస్సయిన అనీషా అంబ్రోస్ కొలతలను హీరో సుమంత్ అశ్విన్ తీసుకుంటున్నట్లుగా ఈ ఫోటో ధృవీకరించింది. హీరోయిన్ ఎద భాగాల కొలతలను హీరో తీసుకునే ఫోటో కావడంతో, సోషల్ మీడియాలో ఈ ఫోటో హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తోన్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్ మిగిలిన వారి కంటే కాస్త సెక్సీ లుక్స్ తో దర్శనమివ్వడం విశేషం.



