‘లేడీస్ టైలర్’ సినిమా టీవీలలో వస్తోంది అంటే ఇప్పటికీ కళ్ళు ఆర్పకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సీక్వెల్ గా “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే సినిమాను దర్శకుడు వంశీ రూపొందిస్తున్నారు. ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా ‘ప్రీ లుక్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ముఖాలు కనిపించకుండా, విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఓ హాట్ బ్యూటీ కొలతలను హీరో తీసుకుంటున్నట్లుగా కనపడుతోంది. అయితే దర్శకుడు ఎద కొలతలతో కూడిన పోస్టర్ విడుదల చేయడంతో, అది కాస్త హాట్ హాట్ గా మారింది. సుమంత్ అశ్విన్ సరసన ముగ్గురు కధానాయికలు మనాలి రాథోడ్, అనిషా అంబ్రోస్, మానస హిమవర్షలు నటిస్తుండగా, ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు.
చాలా కాలం తర్వాత మళ్ళీ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని వినబోతున్నాము. తన సినిమాల పాటల విషయంలోనూ తన మార్క్ చూపించే వంశీకి మణిశర్మ సంగీతం ఏ విధంగా సెట్ అయ్యిందో చూడాలి. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అతి త్వరలోనే విడుదల కానుంది. ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ అయితే లభించినట్లే.



