“ఫిదా” ఆల్బమ్ కు ‘ఫిదా’ కావాల్సిందే!

Fidaa movie audio reviewశేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ “ఫిదా” ఫుల్ ఆల్బమ్ యూ ట్యూబ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ‘వచ్చిండే..,’ ‘ఏదో జరుగుతోంది…’ పాటలు సూపర్ హిట్ గా నిలవడంతో ఈ ఆడియోపై సంగీత సాహిత్య ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా అంచనాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా “ఫిదా” ఆడియోకు అదిరిపోయే స్పందన రావడం విశేషం.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో గుర్తుంచుకునే ఆడియోలే కరువవుతున్న నేపధ్యంలో, నాని “నిన్ను కోరి” ఆల్బమ్ కు శ్రోతల నుండి సూపర్ స్పందన రాగా, ఇపుడు దానిని మించిపోయే విధంగా వరుణ్ – శేఖర్ ల “ఫిదా” ఆడియో నిలుస్తోంది. ఆ ఆల్బమ్ లో మళ్ళీ మళ్ళీ వినిపించే పాటలలో ఇప్పటికే ‘వచ్చిండే’ అన్న పాట నిలువగా, తాజాగా ‘ఊసుపోదు… ఊరుకోదు… ఉండనీదు… వెళ్ళనీదు…’ అన్న పాట కూడా చేరింది.

చైతన్య పింగళి రచించిన ఈ పాటను హేమచంద్ర ఆలపించారు. ప్రేమలో మునిగి తేలిన వ్యక్తి విరహంలో పాడుకునే పాటగా లిరిక్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా ఆడియోలో దర్శకుడు శేఖర్ కమ్ములకు కూడా బాగా ఇష్టమైన పాట ఇది. మొత్తమ్మీద ‘కో అంటే కోటి’ సినిమా తర్వాత అవకాశం దక్కించుకున్న సంగీత దర్శకుడు శశికాంత్ కార్తీక్ “ఫిదా” ద్వారా బాగా రాటుదేలాడని చెప్పవచ్చు. ఫైనల్ గా… ఈ “ఫిదా” ఆల్బమ్ కు ఎవడైనా ‘ఫిదా’ కావాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories