రియల్ లైఫ్ రివేంజ్ కధలు రానూ రానూ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్ధులు బోనం సాయిరామ్, నిమ్మకాయల శేషయ్య మధ్య తలెత్తిన ఓ అమ్మాయి వివాదంతో, ఇరు పక్షాలు వ్యతిరేక విష ప్రచారానికి తెరలేపారు.
ఇందులో భాగంగా ఓ ఫ్లెక్సీని… ‘రిసార్ట్స్ లో అమ్మాయిలను సప్లై చేయబడును, నిమ్మకాయలతో మసాజ్ చేయబడును… బుకింగ్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు” అంటూ నగర ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేయడం సదరు పరిధిలోని సీఐ కంట పడడంతో అసలు విషయాన్ని బయటకు లాగి సంబంధిత వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వికృత చేష్టలపై ఉపేక్షించేది లేదని సీఐ శ్రీనివాస్ స్పష్టం చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





