రెండు రోజుల్లో నాలుగు “మెగా” ఫ్యామిలీ ఈవెంట్లు!

four mega movie  launches in 2 daysమంచి రోజులు లేకపోవడంతో మెగా ఫ్యామిలీ సినిమాల ప్రారంభోత్సవాలు గురు, శుక్రవారాలు వేదిక అయ్యాయి. ఈ రెండు రోజుల్లో నాలుగు మెగా ఫ్యామిలీ సినిమాలు లాంచనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. తొలి రోజు మూడు సినిమాలు ప్రారంభం కాగా, నేడు మెగా అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైంది.

ADVERTISEMENT

అభిమానులకు, మీడియా వర్గాలకు దూరంగా చిరంజీవికి అచ్చివచ్చిన గృహంలో తన 150వ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుకలు జరిగాయి. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంపికైందన్న ప్రచారం సాగుతోంది. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడంతో ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది.

ఇక, గురువారం నాడు పవన్ కళ్యాణ్ – ఎస్ జే సూర్య దర్శకత్వంలో ‘హుషారు,’ శ్రీనువైట్ల – వరుణ్ తేజ్ కాంభినేషన్ లో ‘మిస్టర్,’ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ హీరోగా మరో సినిమాలు లాంచనంగా ప్రారంభమయ్యాయి. వరుస మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల ప్రారంభోత్సవాలతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ ఈ ఏడాది చివర్లో, మరికొన్ని సంక్రాంతికి సిద్ధం కావచ్చని ట్రేడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories