జనసేనకు మరోసారి 100% స్ట్రైక్ రేట్…

Jana Sena municipal election victory

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ మరోసారి తనదైన ముద్ర వేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో సంచలనం సృష్టించిన జనసేన.. తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల్లోనూ అదే విజయ పరంపరను కొనసాగించింది.

కూటమి పొత్తులో భాగంగా పోటీ చేసిన అన్ని మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం విజయాన్ని నమోదు చేసింది. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన స్థానం మరింత బలపడిందనడానికి ఒక స్పష్టమైన సంకేతం.

ADVERTISEMENT

విజయవాడ, ఏలూరు కార్పొరేషన్ల మేయర్ స్థానాలతో పాటు 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ పీఠాలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా విజయవాడ వంటి కీలక నగరంలో వంగవీటి రాధాకృష్ణను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే మరోవైపు పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలోనూ జనసేన తన పట్టును నిరూపించుకుంది. ఈ విజయం జనసేనకు నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎన్నికల ముందు వరకు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్ల విషయంలో పవన్ పై అలకపూనిన జనసైనికులకు ఇప్పుడీ విజయం వారి అలకను తీర్చనుంది.

ఎన్ని చోట్ల పోటీ చేసాం అనేదానికన్నా ఏ స్థాయి విజయం సాధించాం, పార్టీ విన్నింగ్ పర్శంటేజ్ ఎంత అనేదానికి పవన్ ప్రాధాన్యతనిస్తున్నారన్న విషయం పవన్ అభిమానులతో పాటుగా జనసేన మద్దతుదారులకు కూడా స్పష్టమవ్వాలి. పవన్ తన పార్టీ అభ్యర్థి కోసం ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా జనసేన జెండా ఎగరడం ఖాయం అనే గ్యారెంటీని మిత్రపక్ష పార్టీలకు కూడా ఇచ్చినట్టయ్యింది.

ఇది భవిష్యత్ లో జనసేన సీట్ల ఎంపిక విషయంలో పార్టీకి లబ్ది చేకూర్చే అంశం. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఇదేవిధమైన మిత్ర ధర్మం కొనసాగితే రాష్ట్రంలో కూటమికి, జనసేన కు తిరుగుండదు అనే స్పష్టమైన సంకేతాన్ని కూడా పవన్ తన పార్టీ మద్దతుదారులకు అందించినట్టయ్యింది.

ADVERTISEMENT
Latest Stories