సంచలనం – అనామకుడి చేతిలో పరాభవం!

French Open 2018 - Marco Cecchinato shocks Novak Djokovicఫ్రెంచ్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. కెరీర్ లో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న ఇటలీకి చెందిన మార్క్ సెచినాటో అనే ఓ అనామకుడు, వరల్డ్ టాప్ ప్లేయర్లలో ఒకరైన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ని మట్టి కరిపించి షాక్ ఇచ్చాడు. 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన జకో, ఈ మ్యాచ్ ని కనీసం 5వ సెట్ లోకి తీసుకెళ్లలేక, సెచినాటో చేతిలో ఘోర ఓటమి పాలయ్యాడు.

ADVERTISEMENT

దాదాపు 3 గంటలా 26 నిమిషాలు సాగిన పోరులో 6–3, 7–6 (7/4), 1–6, 7–6 (13/11)తో 20వ సీడ్ గా బరిలోకి దిగిన జకోవిచ్ ని సెచినాటో బోల్తా కొట్టించాడు. తన గెలుపుతో 25 ఏళ్ల సెచినాటో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్ కు చేరిన ఘనత సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ కు ముందు అతను తన కెరీర్ లో ఎన్నడూ గ్రాండ్ స్లామ్ పోటీల రెండో రౌండ్ కు కూడా చేరకపోవడం గమనార్హం.

ఇక 1999 లో ఆండ్రీ మెద్వదేవ్ తరువాత, ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ కు చేరిన అతి తక్కువ ర్యాంక్ ఆటగాడిగా సెచినాటో నిలిచాడు. అంతేకాదు, 1978లో కొరాడో బారాజుటి తరువాత సెమీస్ చేరిన తొలి ఇటలీ ఆటగాడు కూడా సెచినాటోయే. దీంతో ఒక్కసారిగా ఈ ఆటగాడిపై టెన్నిస్ ప్లేయర్ ల దృష్టి ఏర్పడింది. మున్ముందు మరెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories