యుఎస్ ఈవెంట్ లో మొదటి తెలుగు స్టార్ ఈవెంట్

Game Changer Event USA

రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ మోస్ట్ కాస్ట్లీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మునుపెన్నడూ లేని విధంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది.

ADVERTISEMENT

డిసెంబర్ 21వ తేదీన అంటే మరికొద్ది గంటల్లో ఈ ఈవెంట్ జరగబోతోంది. సాధారణంగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ అవి కూడా సినిమా రిలీజయిన తర్వాత మాత్రమే అమెరికాలో చేసేవారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించడానికి అంతా రెడీ అయింది.

గేమ్ చేంజర్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసి అంతా సిద్ధం చేశారు. హీరో రామ్ చరణ్ తేజ, దర్శకుడు శంకర్ తో పాటు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అలాగే ఈ ఈవెంట్ హోస్ట్ చేయబోతున్న సుమ కూడా ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు.

వారు మాత్రమే కాదు ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తేజతో సినిమాలు చేయబోతున్న దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కి హాజరు కావడం కోసం డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ లో రామ్ చరణ్ అభిమానులు వీరికి ఒక రేంజ్ లో వెల్కమ్ చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories