వెబ్ సిరీస్ కి కూడా “A” ఇవ్వాల్సిందే?

gandi baat2 webseriesసినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్లు వెబ్ సిరీస్ కి కూడా ఒక సెన్సార్ బోర్డు ఉండాలేమో..ఎందుకంటే సినిమాలో కట్స్ ఉంటూ ఉండడంతో పాపం దర్శకులు తమ కళా నైపుణ్యాన్ని సరిగ్గా చూపించలేక పోతున్నారు..అందుకే ఇలా వెబ్ సిరీస్ ని ఎంచుకుని అందరికీ వారు రాసుకున్న పాత్రలను విప్పి మరీ చూపిస్తున్నారు..అదే మనసు విప్పి మరీ చూపిస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

మొన్నటికి మొన్న ఆర్జీవీ గన్స్ అండ్ థైస్ అంటూ పోర్న్ బ్యూటీతో హడావిడి చేసాడు అంతటితో ఆగకుండా ‘కడప’ అంటూ బూతులు చూపించే ప్రయత్నం ఆరంభించాడు..ఇక హిందీలో అయితే బోల్డ్ కంటెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ అయితే కోకొల్లలు.

ఆ మధ్య ఏక్తా కపూర్ తీసిన “గంది బాత్‌” అనే అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ అయితే భారీ హిట్ అయ్యింది..ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా షురూ చేశారు మన ఏక్తా కపూర్ అండ్ టీమ్.

అయితే ఇందులో కూడా ‘ఏ’ సర్టిఫికెట్ సీన్స్ చాలానే ఉంటాయట. ఇలా వరుసగా బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ వస్తూ ఉంటే..దీనిపై సెన్సార్ అనే పదం వెలుగులోకి రాకపోతే..చాల కష్టం అనే చెప్పాలి. మరి వెబ్ సిరీస్ కి కూడా సెన్సార్ హద్దులు పెడతారేమో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories