‘గరుడ’ ఇప్పుడు ఈయన చేతిలో..!

manchu vishnu bhaktha kannappa movie with tanikella bharaniటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ పూర్తి అయిన తర్వాత తన తర్వాత సినిమాగా ‘గరుడ’ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో భారీ స్థాయిలో ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. రాజమౌళి సన్నిహితుడు, ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి ‘గరుడ’ టైటిల్‌ను తన వారాహి చలన చిత్ర బ్యానర్‌లో రిజిస్ట్రర్‌ చేయించాడు. సాయి కొర్రపాటి ఈ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మించేందుకే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడని, దాదాపు వెయ్యి కోట్లతో జక్కన్న ఈ ‘గరుడ’ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు అంటూ ప్రచారం జరిగింది. కాని అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది.

‘గరుడ’ టైటిల్‌ రాజమౌళి రిజిస్ట్రర్‌ చేయించమంటే సాయి కొర్రపాటి చేయించలేదు అని, బాగుందనే ఉద్దేశ్యంతో ఆయన రిజిస్ట్రర్‌ చేయించాడు అని, తాజాగా ఆ టైటిల్‌ను మంచు హీరో విష్ణు కోరుకోవడంతో ఆయనకు ఇచ్చాడు అని తెలుస్తోంది. తాజాగా ఛాంబర్‌లో ‘గరుడ’ టైటిల్‌ను మంచు విష్ణు తన పేరు మీద రిజిస్ట్రర్‌ చేయించుకున్నాడు. అందుకు సాయి కొర్రపాటి కూడా ఓకే చెప్పాడు. మంది ‘గరుడ’ రాజమౌళిది కాదు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. త్వరలో మంచు విష్ణు హీరోగా నటించబోతున్న సినిమాకు లేదా ఆయన నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాకు ఈ టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ADVERTISEMENT
Latest Stories