పెద్ద హీరో సినిమా విడుదలయ్యిదంటే చాలు… మా హీరో రికార్డులు అన్ని ఇన్ని కావంటూ సదరు హీరో అభిమానులు గొప్పలు చెప్పుకుంటూ సమాచారాన్ని ఇస్తుంటే, దాని కంటే మా హీరో కలెక్షన్స్ ఎక్కువ అంటూ ఇతర హీరోల అభిమానులు జరుపుకునే చర్చలకు కొదవేలేదు. ఈ రచ్చ సోషల్ మీడియాలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రొచ్చులోకి హీరో విజయ్ దేవరకొండ మూవీ కూడా చేరింది.
[m9ad]
ఆగష్టు 15వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజులకు గానూ 37.45 కోట్లు సాధించిందంటూ ఏరియాల వారీగా కలెక్షన్స్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా సాధించిన అపూర్వ విజయంతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ కలెక్షన్స్ ను ప్రకటించి ఉండొచ్చు గానీ, ఈ ప్రకటన సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ట్రాకింగ్ లేని స్థానిక కలెక్షన్స్ ను పక్కన పెడితే, ట్రాకింగ్ ఉన్న యుఎస్ కలెక్షన్స్ ను పేర్కొంటూ, అక్కడ మార్కెట్ లేని హీరోలను ఆడుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ నటించిన అయిదు సినిమాలలో నాలుగు చిత్రాలు వన్ మిలియన్ మార్క్ పైగా కలెక్షన్స్ ను సాధించగా, ‘ద్వారకా’ ఒక్కటే పూర్తిగా విఫలమైంది. దీంతో 10, 15 సినిమాలు చేసిన మెగా హీరోలను విజయ్ తో పోలుస్తూ ఇతర హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న విజయ్ కు భవిష్యత్తులో ఇది పెద్ద గోలగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎలాంటి దాన్నైనా పాజిటివ్ గా మార్చుకోగల సత్తా విజయ్ సొంతం కదా!



