కోటి క్లిక్స్… సాధారణ విషయమేమీ కాదు..!

Geetha Govindham - Inkem Inkem Inkem Kaavaale song 10 million viewsహీరోగా విజయ్ దేవరకొండకున్న క్రేజ్ ఏమిటో మరోసారి చాటిచెప్పే విధంగా “గీతగోవిందం” సినిమాలోని మొదటి పాట యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది. ఈ నెల 10వ తేదీన యూ ట్యూబ్ లో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె’ అన్న పాటను అప్ లోడ్ చేయగా, 8 రోజులకే 10 మిలియన్ క్లిక్స్ (కోటి) అందుకుని దూసుకుపోతోంది.

ADVERTISEMENT

గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాట ఆహ్లాదకరమైన మెలోడీగా సాగుతుంది. అనంత శ్రీరాం ఇచ్చిన క్యాచీ లిరిక్స్ యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యాయి. ఈ పాటకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కూడా బాగా జరిగింది. ముఖ్యంగా 8 రాత్రులు… 10 మిలియన్స్… అంటూ ప్రతి రోజు అప్ డేట్ ఇవ్వడం నెటిజన్లకు మరింత చేరువ చేసింది.

పెద్ద పెద్ద హీరోల పాటలకు, అగ్ర సంగీత దర్శకులు అందించిన పాటలకు కూడా ఎనిమిది రోజుల్లో 10 మిలియన్ క్లిక్స్ అందుకోవడం అసాధారణంగా ఉన్న తరుణంలో… “గీత గోవిందం”లోని పాట అవలీలగా ఈ ఫీట్ ను సాధించడం చెప్పుకోదగ్గ విషయమే. గీతా ఆర్ట్స్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు.

ADVERTISEMENT
Latest Stories