ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు దీపికా పదుకునే. “రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్” వంటి సినిమాలలో చరిత్రలో నిలిచిపోయే పాత్రలను పోషించిన దీపికా, 2018లో హీరో రణవీర్ సింగ్ తో వివాహాం అయిన విషయం తెలిసిందే. అప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఒక్కటి కావడంతో గాసిప్స్ కు తెరపడినట్లయింది.
రణవీర్ తో పెళ్లయిన నాటి నుండి హాట్ హాట్ సన్నివేశాలకు దూరంగా ఉన్న దీపికా పదుకునే, తాజాగా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైన “గేహరైయాన్” మూవీలో మాత్రం శృతిమించిన శృంగార సన్నివేశాలలో నటించడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుండే దీపికా మరియు అనన్య పాండేల హాట్ నెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక నేడు ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దీపికా పదుకునే లిప్ లాక్ సన్నివేశాలు మరియు హాట్ హాట్ సీన్స్ సోషల్ మీడియాను చుట్టేసాయి. బహుశా కెరీర్ తొలినాళ్ళల్లో కూడా ఇంత హాట్ గా దీపికా నటించలేదేమో అనిపించే విధంగా ఆయా శృంగార సన్నివేశాలను హీరో సిద్ధార్ధ్ చతుర్వేదితో కలిసి పండించింది.
దీంతో ఈ సినిమా ఎలా ఉంది? అన్న టాక్ కంటే కూడా దీపికా ఇంత హాట్ గా ఎలా నటించింది? అన్నదే హైలైట్ అవుతోంది. కధ డిమాండ్ చేస్తే బాలీవుడ్ లో ఇంటిమేట్ సీన్స్ కు కొదవ ఉండదని మరోసారి “గేహరైయాన్” మూవీ రుజువు చేసింది. పెళ్ళికి ముందు ఇలాంటి సీన్స్ చేసినా ఇంత చర్చకు దారి తీసేదో లేదో తెలియదు గానీ, ఇప్పుడు మాత్రం దీపికా పేరు మారుమ్రోగుతోంది.



