ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకున్నట్టున్నారు. అయితే సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ జరుపుకున్న విధానం మాత్రం హైలైట్ గా నిలిచిపోతోంది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసిన ఓ గ్రాండ్ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులతో సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో తీసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ తో పాటు హీరోయిన్లు జెనీలియా, కంచి కౌల్ కూడా దర్శనమిస్తున్న ఈ ఫోటోలో ముగ్గురూ ప్రెగ్నెంట్ కావడం విశేషం. చిలక నవ్వులు ప్రదర్శిస్తున్న ఈ ముగ్గురు సుందరాంగుల ఫోటోను మీరూ ఓ సారి వీక్షించండి..!
ADVERTISEMENT
ADVERTISEMENT





