టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటుల్లో, కధపై మంచి పట్టు ఉన్న నటుల్లో అడవి శేషు ఒకరు. అయితే గత కొంత కాలంగా తనదైన మార్క్ కోసం ఎదురు చూస్తూ ఉన్న శేషు కి అన్నీ తానై తెరకెక్కించిన “గూడాచారీ” మంచి హిట్ గా నిలవడమే కాకుండా అన్ని రకాలుగాను అడవి శేషుకి మంచి ప్లస్ అయ్యింది.
[m9ad]
అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అన్న ఆలోచనను తొలి భాగంలోనే రివీల్ చేసిన అడవి శేషు ఆ మేరకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టేశాడు. అయితే తొలి సినిమాకి సీక్వెల్ అంటే ఆ కధను పొడిగించేలా ముందుకు వెళుతుందా? లేక సీక్వెల్ పేరుతో మరో కొత్త కధను తెరకెక్కిస్తాడా అన్నది అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న. అయితే శేషు పుట్టిన రోజు సంధర్భంగా గూడాచారి-2 ఉండబోతుంది అని, అయితే ఈ సినిమాకి దర్శకుడు మాత్రం మారనున్నాడు అని, గూడాచారికి శశి కిరణ్ తిక్క దర్శకుడిగా వ్యవహరిస్తే…ఈ సీక్వెల్ కు మాత్రం రాహుల్ పాకాల దర్శకత్వం వహించనున్నాడు. అయితే తొలి సినిమా భారీ హిట్ అందుకోవడంతో ఈ సీక్వెల్ కి బడ్జెట్ కూడా భారీగా పెట్టడానికి శేషు అండ్ టీమ్ సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ఇక వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా 2020లో విడుదల కానుంది అని తెలుస్తుంది. అయితే ఒక పక్క దర్శకుడి మార్పు, మరో పక్క బడ్జెట్ లో కూడా భారీ మార్పు ఈ రెండూ ఈ సినిమా ఫలితాన్ని ఎలా డిసైడ్ చేస్తాయో చూడాలి, ఎందుకంటే అసలే మన టాలీవుడ్ లో సీక్వెల్స్ పెద్దగా కలసి రావు…అన్న బ్యాడ్ రిమార్క్ ఒకటి ఉందనే ఉంది కదా..!



