టీజర్ టాక్ – కటింగ్ బాగుందబ్బాయ్!

Goodachari-4K--Teaser (2)సెలక్టివ్ గా సినిమాలను చేసే అడవి శేష్ నుండి తాజాగా రాబోతున్న మూవీ “గూడచారి.” పోస్టర్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగే విధంగా టీజర్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా సినిమా సబ్జెక్ట్ ఏమిటో ప్రేక్షకులకు తెలిసే విధంగా టీజర్ ను అందించారని చెప్పవచ్చు.

‘రా’లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావ్? అంటూ హీరో జాబ్ ప్రొఫైల్ ఏమిటో చెప్పేయగా, సినిమాలో సాంకేతికత మరింత బలంగా కనపడుతోంది. లాస్ట్ షాట్ అయిన బిల్డింగ్ పై నుండి దూకిన షాట్ రియలిస్టిక్ గా ఉండడం, చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ ను చాటిచెప్తోంది. ఆగష్టు 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఈ టీజర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories