చివరి నిముషంలో చేతులెత్తేసిన హీరో!

Gruham Movie  Postponed due to short of theatresహీరో సిద్ధార్థ్ నిర్మాతగా సొంత బ్యానర్లో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగు… హిందీ భాషల్లోను ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెట్టేసి .. నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పాడు. తెలుగులో ఈ సినిమాకి ‘గృహం’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. అయితే తెలుగులో విడుదలను వాయిదా వేశాడనేది లేటెస్ట్ న్యూస్.

ADVERTISEMENT

‘గరుడ వేగ’ .. ‘ఏంజెల్’ .. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సిద్ధార్థ్, రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేసి నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసాడు. తమిళంలో మాత్రం ఈ సినిమా నేడే విడుదలవుతోంది. ఈ ఫలితం ప్రభావం తెలుగుపై కూడా పడే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories