ఆ చావులకు బాధ్యులెవరు.? జస్ట్ ఆస్కింగ్..!

harish-rao-questioning-revanth-reddy

తెలంగాణ రాజకీయం మొత్తం పుష్ప సినిమా చుట్టూ, సంధ్యా ధియేటర్ ఘటన చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన తప్ప మరో సమస్యే లేదన్నట్టుగా అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం ఇక మీడియా మొత్తం కూడా నేరమెవరిది.? శిక్ష ఎవరికీ.? తగ్గిందెవరు.? తగ్గించిందెవరిని.? అంటు ఇదే టాపిక్ మీద చర్చ నడుపుతున్నారు.

అయితే అనూహ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా మరో సంఘటనను తెర మీదకు తెచ్చారు హరీష్ రావు. అనుకోకుండా జరిగిన ఒక ఘటనలో బాధిత కుటుంబం పక్షాన నిలిచి అల్లు అర్జున్ తో పాటుగా టాలీవుడ్ ను సైతం టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ఆ కుటుంబానికి జరిగిన ప్రాణ నష్టం గురించి ప్రస్తావించారు.

ADVERTISEMENT

అలాగే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక నిండు ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు బన్నీ అంటూ ఆయన మీద తీవ్ర వ్యాక్యలు చేసి అల్లు అర్జున్ ని పర్సనల్ టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ అంటూ బిఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలను సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణాలకు కారకులెవరు.?

మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్ష రుణమాఫీ అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా ఆ హామీని నిలబెట్టుకోలేక ఆ రైతన్నల చావుకి కారణం ఈ ప్రభుత్వ పెద్దలు కారా.? అలాగే ప్రభుత్వ గురుకుల విద్యాలయంలో సుమారు 50 మంది అమాయకపు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాలు కోల్పోయారు.

ఆ హత్యలకు ఎవరు బాధ్యత వహించాలి.? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న విధానానికి గాను తమ ఉపాధిని కోల్పోయి దాదాపు 80 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి పాలపడ్డారు. ఆ కుటుంబాల కన్నీటి ఎవరు లెక్క చెపుతారు.? ఇలా మీ ప్రభుత్వం చేతకాని తనంతో, నిర్లక్ష్యంతో ఈ ఏడాదిలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అవి ప్రభుత్వ హత్యలు కావా.? ఆ హత్యలకు దోషులెవరు.? అందులో శిక్ష అనుభవిస్తుంది ఎవరు.? ఇలా రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన అంశాలు అనేకం ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్దేశ పూర్వకంగానే సినీ పరిశ్రమను టార్గెట్ చేయడానికి సంధ్యా ధియేటర్ అంశాన్ని తెర మీదకు తెచ్చి డైవెర్షన్ పాలిటిక్స్ కథ నడిపిస్తున్నారు అంటూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories