హరీష్‌ శంకర్‌కు హీరో దొరకట్లేదు

harish shankar next movie‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు రావడంతో హరీష్‌ శంకర్‌ ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రంతో ఈయన స్టార్‌డం అంతా పోయింది. ఈయనతో అంతకు ముందు సినిమాలు చేస్తామని చెప్పిన హీరోలు మొహం చాటేశారు. దాంతో కసితో యువ మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా విజయంతో ఈయన దర్శకత్వంలో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపుతారని అంతా భావించారు. కాని ఈయనకు ఇప్పటి వరకు కూడా హీరో దొరకలేదు.

‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీ విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఈయన తర్వాత సినిమా గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈయన సంప్రదించిన ఏ ఒక్క హీరో కూడా సరైన రెస్పాండ్‌ అవ్వడం లేదు. మొదట అల్లు అర్జున్‌తో ఈ దర్శకుడు సినిమా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కాని బన్నీకి ఈయనపై నమ్మకం కలుగుతున్నట్లుగా లేదు. అందుకే ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి శ్రీను చిత్రం పూర్తి అవ్వగానే తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇతర హీరోలు సైతం హరీష్‌ శంకర్‌ను పట్టించుకోవడం లేదు. దాంతో ఈయనకు మళ్లీ చిన్న హీరోనే గతి అవుతాడా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories