దేశ ప్రజలను దోచేస్తున్న మోడీ! కళ్ళ ముందున్న సాక్ష్యాలు!

narendra modi cheating peopleఅవును… దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ నిర్ధాక్షిణ్యంగా దోచేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే చర్చ. అంతర్జాతీయ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు డాలర్స్ లో తగ్గుతుంటే, భారత్ లో మాత్రం పైసలలో ప్రభావం చూపుతోంది. తగ్గుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకం రూపంలో పెంచుతూ కవర్ చేస్తుండడం దేశ ప్రజల ఆగ్రహంతో పాటు, విశ్లేషకుల విమర్శలకు తావిస్తోంది.

గడచిన రెండు నెలల కాలంలో పెట్రో ఉత్పత్తులపై నాలుగోసారి ఎక్సైజ్ సుంకాన్ని మోదీ సర్కారు వడ్డించింది. అంతర్జాతీయ మార్కెట్లో 30 డాలర్ల కన్నా దిగువకు క్రూడాయిల్ ధరలు చేరుకున్న వేళ, శుక్రవారం నాడు పెట్రోలుపై 32 పైసలు, డీజెల్ పై 85 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ)లు ప్రకటించగా, ఆ వెంటనే మరోసారి పన్నులను పెంచుతున్నట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది.

ADVERTISEMENT

పెట్రోలుపై 75 పైసలు, డీజెల్ పై 1.83 రూపాయలు పన్ను విధిస్తున్నట్టు ఆదేశాలు వెలువరించింది. అంతకు ముందు జనవరి1వ తేదీన, డిసెంబర్ మొదటి, మూడవ వారాల్లో సైతం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆ వెంటనే ఎక్సైజ్ సుంకాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ తాజా పన్ను పెంపుతో కేంద్రానికి అదనంగా 3,700 కోట్ల ఆదాయం రానుంది. ఇక తగ్గిన ధరతో పోలిస్తే పన్ను బాదుడే అధికంగా ఉండటంతో, ఇండియాలో పెట్రోలు ధర పెరిగినట్లయింది.

మోడీ అనుసరిస్తున్న ఈ తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల టాలీవుడ్ హీరో నిఖిల్ సైతం దీనిపై కామెంట్ చేస్తూ… మోడీని ప్రశ్నించిన విధానం తెలిసిందే. బయటపడింది ఒక్క నిఖిల్ మాత్రమే అయ్యుండొచ్చు… కానీ ఆ అభిప్రాయం దాదాపుగా దేశ ప్రజలది. ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు మోడీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని నిపుణులు వ్యక్తపరుస్తున్నా, దానికి పద్ధతి ఇది కాదని విశ్లేషిస్తున్నారు. కళ్ళ ముందే జరుగుతున్న ఈ విధానం పట్ల ప్రతిపక్షాలు కూడా మిన్నకుండిపోవడం విస్తుపోయే అంశం.

ADVERTISEMENT
Latest Stories