సినిమాకు పబ్లిసిటీ చేయడం ఓ ఆర్ట్. ఇందులో విజయ్ దేవరకొండ పీ.హెచ్.డీ చేసినట్లుగా కనపడుతోంది. డిజైన్ ఎవరూ చేసినా, ప్రేక్షకుల ముందుకు తన సినిమాను తీసుకెళ్లడంలో, ప్రస్తుత హీరోలలో విజయ్ దేవరకొండను మించిన వారు మరొకరు లేరన్నట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. అందుకు ఉదాహరణే తాజాగా “టాక్సీవాలా”కు సంబంధించిన వీడియో ప్రమోషన్.
[m9ad]
ADVERTISEMENT
ఇప్పటికే లీక్ అయిన రా ఫుటేజ్ ను దాటుకుని, ధియేటర్లలోనే సినిమాను ఎందుకు చూడాలన్న దానిని సింపుల్ గా మూడున్నర్ర నిముషాలలో చెప్పేసాడు విజయ్. ఈ కాన్సెప్ట్ వీడియో అదిరిపోవడంతో, ‘టాక్సీవాలా’కు తగినంత పబ్లిసిటీ దక్కుతోంది. ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ఈ నెల 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఈ వీడియోలో స్పష్టం చేయగా, ధియేటర్లలోకి 17వ తేదీన మూవీ రానుంది.
ADVERTISEMENT



