మళ్లీ సుక్కు బ్యానర్‌లో హెబ్బా

Hebha-Patel in another sukumar productionప్రముఖ దర్శకుడు సుకుమార్‌ మొదటి సారి నిర్మాతగా మారి నిర్మించిన ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హెబ్బా పటేల్‌కు మంచి పేరు వచ్చింది. అందం, అభినయం కలగలిసిన హీరోయిన్స్‌ టాలీవుడ్‌లో కొద్ది మంది మాత్రమే ఉన్నారని, వారిలో హెబ్బా కూడా ఒకరు అంటూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. దాంతో ఈమెకు వరుసగా స్టార్స్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం వస్తోంది. ఈమె ట్యాలెంట్‌ను మెచ్చి దర్శకుడు సుకుమార్‌ మరోసారి ఈమెకు ఛాన్స్‌ ఇచ్చాడు.

సుకుమార్‌ తన నిర్మాణ సంస్థలో మరో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమాతో తన మేనల్లుడు అశోక్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు సుకుమార్‌ తీసుకు రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్‌ కథ మరియు స్క్రీన్‌ప్లేను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాతో తన శిష్యుడిని దర్శకుడిగా సుకుమార్‌ పరిచయం చేయబోతున్నాడు. ఒక వైవిధ్యభరిత కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా సుకుమార్‌ సన్నిహితులు చెబుతున్నారు. అశోక్‌ మరియు హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథతో నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది.

ADVERTISEMENT
Latest Stories