గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

BRS MLC Thatha Madhu Remarks in Telangana Assembly

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏపీలో వైసీపీ అనుసరించిన భాష రాజకీయ నిఘంటువులో కొత్త పదాలను, వాటికీ సరికొత్త అర్ధాలను భోదించగా,

ఇప్పుడు ఆ భాషను ఇతర పార్టీల నేతలు కూడా దత్తతు తీసుకుంటున్నారు. తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అసెంబ్లీ ప్రాగణంలోనే స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నల్ల చొక్కాలతో ప్రభుత్వం పై నిరసన తెలియచెయ్యాలనుకున్న బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ADVERTISEMENT

దీనితో తమ పార్టీ నేతల పై పోలీసుల చర్యల మీద ఆగ్రహించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అసలు మీకాధికారం ఎవడిచ్చాడు.? అంటూ స్పీకర్ ను ఉద్దేశించి అసభ్యకర రీతిలో దూషించారు. సాక్షుత్తు మీడియా ముందే తాత మధు ఇలా రెచ్చిపోవడంతో అసలు ఈ రాజకీయ నాయకులకు ఏమయ్యింది.? వీరి భాష నానాటికి ఎందుకింతలా దిగజారుతోంది.? ఈ పాపం ఎవరిదీ.? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు సామాన్య ప్రజానీకం.

సమాజానికి మంచి చేస్తారనే ఉద్దేశంతో చట్టసభలకు పంపుతున్న ఈ సోకాల్డ్ నాయకులు చివరికి తమ బూతులతో సమాజానికి ఎం సందేశం ఇస్తున్నట్టు.? అనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. అలాగే ఇటువంటి వారు చట్టసభలకు అర్హులా అనేది పార్టీ అధినేతలు సైతం ఒక్కసారి పునరాలోచన చేయాలంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.

తాత మధు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు గాను మధు పై మండలి చైర్మన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, సభాహక్కుల ఉల్లఘన చట్టం కింద ఆయన పై వేటు వేయాలంటూ సీఎం రేవంత్ మొదలు కాంగ్రెస్ నేతలు, మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే బిఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ కూడా రాజ్యాంగ పదవులలో ఉన్నవారి పై ఇటువంటి దిగజారుడు దూషణలు చేస్తున్న పార్టీ నేతల పై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని పట్టుబడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే రాజకీయ నేతలు క్షణికావేశంలోనో, అధినేతల మెప్పు కోసమో గీత దాటితే దాని పర్యనాశనలు పార్టీ మొత్తం అనుభవించాల్సి వస్తుందని వైసీపీ ని చూస్తే యిట్టె అర్ధమవుతుంది.

నాడు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి తో వైసీపీ రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరిగింది. ఇక తాజాగా అంబటి రాంబాబు సైతం ఇదే తీరుగా సీఎం చంద్రబాబు ని ఉద్దేశించి నడిరోడ్డు మీద మీడియా సాక్షిగా అసభ్యకర రీతిలో రెచ్చిపోయారు. ఫలితంగా పోలీసులు అరెస్టు చేస్తే దాని కుల రాజకీయాలుగా మార్చి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసారు.

ఇటువంటి తరుణంలో రాజకీయ నాయకుల భాషకు సంబంధించి కూడా చట్టసభలలో బలమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఏర్పాటుందేమో బహుశా..! ఆ పార్టీ వారిని చూసి ఈ పార్టీ వారు, ఆ పార్టీ నేతలను విమర్శించడాన్ని ఈ పార్టీ వారు, వారికీ కౌంటర్ వేయడానికి ఇంకొకరు ఇలా రాజకీయాలలో బూతులను పెంచి పోషిస్తున్నారు, పార్టీ పెద్దలే దగ్గరుండి అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలు ప్రజల నుండి వినపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories