రామ్ – అనుపమ జంటగా తెరకెక్కిన “హలో గురు ప్రేమకోసమే” సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైన మూడు గంటల్లోనే హాఫ్ మిలియన్ క్లిక్స్ ను అందుకోవడంతో పాటు 500కే లైక్స్ ను సొంతం చేసుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. నిజానికి ఈ టీజర్ కు అంత సీన్ కూడా ఉందనే చెప్పాలి. అనుపమ నడుం సీన్ తో మొదలై రామ్ హాట్ డైలాగ్ తో ముగిసే ఈ టీజర్, సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది.
[m9adh]
ADVERTISEMENT
దానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం తోడు కావడం మరింత దోహదమైంది. ‘నేను లోకల్’ సినిమాను విజయవంతంగా తెరకెక్కించిన త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే ఈ సినిమాకు కూడా నిర్మాత. చూడబోతుంటే… మరో కమర్షియల్ బొమ్మకు ఈ టీజర్ శ్రీకారం చుట్టినట్లే కనపడుతోంది. గత సినిమాలతో పోలిస్తే రామ్ క్లీన్ అండ్ మ్యాన్లీగా కనపడుతున్నాడు.
ADVERTISEMENT



