తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై వేసిన మరో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓటర్ల సవరణ గడువు తగ్గించడాన్ని సవాలు చేస్తు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఇవాళ న్యాయస్థానం విచారించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అని హై కోర్టు తేల్చి చెప్పింది. దీనితో ఎన్నికలకు మార్గం సుగమమైనట్టే.
[m9ad]
ఎన్నికల కమిషన్‌కు విశేష అధికారాలు ఉంటాయని.. ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఎన్నికల సంఘం చూసుకుంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ఏర్పాటు పై ముమ్మర కసరత్తు చేస్తుంది.
ఎట్టి పరిస్థితులలోనూ నవంబర్ లోగానే ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాలకు వీలైనంత తక్కువ సమయం ఇవ్వడమే వ్యూహంగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. దీనికి కేంద్రం కూడా సహకరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఆగమేఘాల మీద ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.



