ఆ డైరెక్టర్ ను కొట్టండి… క్యాష్ పట్టండి..!

Hindu Outbrust on Sita Im not a Virgin Shortfilmప్రస్తుతం వివాదం లేకుండా యూ ట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించలేమని అర్ధమవుతోంది. ఏదొక డైలాగ్ లో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతినడం, మీడియా వేదికగా వారు రచ్చ రచ్చ చేస్తుండడంతో, వివాదం చుట్టుముట్టడంతో పాటు పబ్లిసిటీ కూడా పతాక స్థాయిలో వస్తోంది. అలాంటి జాబితాలోనే “సీత – ఐ యామ్ నాట్ వర్జిన్” అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేరింది. ఈ షార్ట్ ఫిలిం టైటిల్ పై ఇప్పటికే వివాదం చెలరేగగా, తాజాగా అది ఇంకా ముదిరి పాకాన పడినట్లు కనపడుతోంది.

ఈ షార్ట్ ఫిల్మ్ కు టైటిల్ పెట్టిన దర్శకుడు కౌశిక్ బాబు ఇప్పటికే హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా టైటిల్ ఉందని, దీనిని మార్చుకోవాలని కోరగా, మరో వైపు దర్శకుడు కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టత ఇచ్చారు. తాజాగా హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి మేకల శ్రీనివాస్ యాదవ్, సదరు షార్ట్ ఫిల్మ్ దర్శకుడుపై ఓ రేంజ్ మండిపడ్డారు. అంతేకాదు, కొన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించారు.

ADVERTISEMENT

ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వారికి 50 వేల రూపాయ‌లు ఇస్తామని, ఇక కౌశిక్‌ను ఏకంగా రాముడు సన్నిధికే పంపిస్తే లక్ష రూపాయల బహుబతి ఇస్తామ‌ని ప్రకటించారు. ఈ టైటిల్ తో చెత్త పబ్లిసిటీ కోసమే కౌశిక్ ఆరాటపడుతున్నాడని విమర్శించారు. అయితే తమకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం కొనసాగాలి తప్ప, ఇలాంటి పబ్లిక్ వార్నింగ్ లతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు సదరు సంఘాలు ఇస్తున్నాయో అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories