“ఆర్ఎక్స్ 100” సినిమాతో పాపులర్ అయిన కార్తీకేయ, తనకు వచ్చిన పాపులారిటీని ఏదొక సినిమా కోసం వినియోగించుకోకుండా, తదుపరి సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ క్రమంలోనే “హిప్పీ” అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి, నేడు సెట్స్ పైకి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం జరిపిన ఫోటోషూట్ పిక్స్ ను విడుదల చేసారు.
ADVERTISEMENT
[m9ad]
కండలు తిరిగిన శరీరంతో… బాడీ అంతా టాట్టులు వేయించుకుని ఉన్న కార్తీకేయ లుక్ యూత్ ను ఆకర్షించే విధంగా ఉంది. అలాగే యూత్ కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ ను ఖరారు చేసిన ఈ సినిమాకు టియెన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తుండగా, ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.థను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ADVERTISEMENT



