ఒకప్పుడు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన ‘డోర్ డెలివరీలు’ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది చాలా సౌకర్యవంతంగా ఉండటంతో దేశ ప్రజలు కూరగాయలు, నిత్యావసర సరుకులు, టిఫిన్స్, మందులు మొదలు ఫ్రిజ్జిలు వాషింగ్ మెషిన్స్ వరకు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకొని ఇంటికి రప్పించుకుంటున్నారు. అయితే ఒక్కోసారి ఈ వెసులుబాటే కొన్ని ఊహించని సమస్యలకు దారి తీస్తోంది.
బెంగళూరులో జరిగిన ఈ ఘటన అటువంటిదే. భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూలుకి వెళ్ళినప్పుడు ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉంటారు. అదే సమయంలో ఓ వస్తువు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ అత్యవసరంగా టాయిలెట్‌కి వెళ్ళాలని ఇంట్లో ఉన్న మహిళని అడిగాడు.
కానీ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నందున అతనిని లోనికి అనుమతించలేదు. అయితే అతను ఆమెను పక్కకు తోసి ఇంట్లోకి ప్రవేశించి టాయిలెట్ వాడుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరితోనైనా చెప్తే ‘కబడ్దార్’ అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు. అతను బలవంతంగా ఇంట్లో జొరబడి, తనతో అసభ్యంగా ప్రవర్తించేసరికి ఆమె షాక్ అయ్యింది.
ఇవన్నీ ఇంట్లో, బయట ఉన్నా సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్నాయనే సంగతి ఆ డెలివరీ బాయ్ గ్రహించలేదు. అదే ఆమె అదృష్టమనుకోవాలి. అంటే వాటి ఆధారంగా పోలీసులు అతనిని కనిపెట్టడం సులువు అవుతుందని కాదు. తన గురించి సాక్ష్యాధారాలు నమోదవుతున్నాయని అతను గ్రహించి ఉంటే ఆమె ప్రాణానికి ప్రమాదం ఏర్పడేది.
ఆ తర్వాత ఆమె భర్తకి ఫోన్ చేసి చెప్పడం, అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి ఆమె చెప్పిన వివరాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ డెలివరీ బాయ్‌ని కనిపెట్టేందుకు గాలింపు మొదలుపెట్టారు.
ఆమె తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
రేయనక పగలనకా ఎండనకా వాననక కష్టపడే డెలివరీ బాయ్స్ పట్ల మానవత్వం చూపడం ఎంత అవసరమో, వారిలో ఇటువంటివారు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు, టీనేజ్ పిల్లలు, వృద్ధులు ఇళ్ళకు గ్రిల్ గేట్స్ పెట్టుకొని ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
एक महिला ना कहने पर भी एक लड़का उनका Washroom Use किया उनको उसका Private Part दिखाए ।
एक Flipkart/Myntra का Delhivery Boy parcel लेेकर आता है एक लड़की के पास उसके बाद उन्होंने कहा कि आपका Washroom Use कर सकता हूं क्या ।
लेकिन वो लेडीज अकेला रहता है इसलिए ना कहा लेकिन वो नहीं… pic.twitter.com/rJFaJVRUWT
— Subhajit Das (@SantaniSubhajit) July 11, 2026




