తండ్రి జీవిత చరిత్రని తెరపై ఆవిష్కరించాలి అని బాలయ్య పడుతున్న తపనకు ట్రేడ్ కూడా సపోర్ట్ చేస్తే ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
[m9ad]
సినిమా పరంగా ట్రేడ్ లో మంచి హైప్ ఉన్న సినిమా కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా పార్ట్-1 దాదాపుగా 70 కోట్లకు పైగానే వసూళ్లు సాధిస్తుంది అని అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే అన్ని చోట్లా భారీగా బిజినెస్ కూడా అయ్యిపోయింది. కట్ చేస్తే మొదటి భాగం ఫలితాన్ని..ఆ భాగంలో వదిలి పెట్టిన సస్పెన్స్ ని ఆధారంగా చేసుకుని రెండో భాగం కూడా భారీగానే వసూళ్లు సాధిస్తుంది అని అంచనా…
మొత్తంగా ఒక 40 నుంచి 50 కోట్ల పైగానే రెండో భాగం వసూళ్లు వస్తాయి అని అంచనా…ఇక తమిళం…హిందీ..ఆడియో…డిజిటల్…సాటిలైట్ ఇలా అన్నీ కలసి…మొత్తంగా 200 కోట్ల ట్రేడ్ మార్క్ ను ఈ సినిమా అందుకుంటుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.
మరి అదే జరిగితే మాత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్ అయిన సినిమాగా..వందల కోట్ల సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది..



