మనిషిని శాశిస్తున్న సోషల్ మీడియా… ఏఐ!

How Social Media and AI Are Destroying Human Lives

మన జీవితాలలోకి మన ప్రమేయం లేకుండానే చొరబడింది ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియా మాత్రమే. నేటికీ కొన్ని కోట్లమందికి దీని గురించి తెలియకపోవచ్చు. తెలిసినా పెద్దగా ఉపయోగించకపోవచ్చు. కానీ ఉపయోగిస్తున్న వారందరూ తమ తమ అవసరాలకు తగినట్లు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.

అది అంతవరకే పరిమితం అని అనుకుంటారు. కానీ సోషల్ మీడియా ఇప్పుడు మనుషుల జీవితాలను తారుమారు చేసే స్థాయికి చేరుకుందంటే నమ్మబుద్ది కాదు.

ADVERTISEMENT

సెల్ఫీలు, రీల్స్ చేసిన కొందరిని సోషల్ మీడియా ఎంతగా వెంటాడి వేదిస్తుందో చూస్తూనే ఉన్నాము. చివరికి వారు చేతులు జోడించి కన్నీళ్ళు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో కనిపించని ఆ అదృశ్యశక్తులకు దణ్ణం పెట్టి క్షమాపణలు చెప్పుకోవడం అందరం చూస్తూనే ఉన్నాము.

సెలబ్రెటీలు ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరితో చనిపోయారంటూ పుకార్లు పుట్టించడం, దాంతో వారు మేము ఇంకా బ్రతికే ఉన్నామని చెప్పుకునే పరిస్థితి దాపురించింది… దేనివల్లనంటే సోషల్ మీడియా వల్లనే.

సోషల్ మీడియాలోకి రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవేశించిన తర్వాత ఈ కాలుష్యం ఇంకా పెరిగిపోయింది. రాక్షసుడు చేతికి శక్తివంతమైన ఆయుధం లభించినట్లు, దానిని తమ ప్రత్యర్ధుల మీద ప్రయోగిస్తూ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికైనా, దెబ్బ తీయడానికైన సోషల్ మీడియా వేదికగా మారింది.

మానవ సమాజంలో మెరుగైన, వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా సోషల్ మీడియాలో ఉద్భవించింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని దేనికి దేనికి వినియోగిస్తున్నారు?ఎలా వినియోగిస్తున్నారు? అని ఓసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే అది ఎంతగా పతనం అయ్యిందో కనిపిస్తుంది.

కేవలం అది సాంకేతికంగా పతనమైతే మరొకటి సృష్టించుకోవచ్చు. కానీ హాలీవుడ్‌ సినిమాలలో మనిషి సృష్టించిన రోబోలు మనుషులను నియంత్రించినట్లుగానే ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు మానవ సమాజాన్ని శాశిస్తోంది.

ఇలాంటి అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియాకు ఇప్పుడు అంతకంటే శక్తివంతమైన ప్రమాదకరమైన ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్’ (ఏఐ) తోడయ్యింది. దీంతో ఒక మనిషి ఫోటో పెడితే చాలు గుడ్డలూడదీసి నలుగురిలో నిలబెట్టేయగలదు. ఆ మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేయగలదు కూడా.

కనుక ఈ సోషల్ మీడియా, ఈ ఏఐ టెక్నాలజీ భవిష్యత్‌లో ప్రళయం సృష్టించక మానవు. కనుక వీటితో తస్మాత్ జాగ్రత్త! ముఖ్యంగా వీటి గురించి అవగాహనా లేనివారు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది.

ADVERTISEMENT
Latest Stories