హృతిక్ సినిమాకు 150 కోట్ల నష్టం… షారుక్ పన్నాగమే కారణం..!

Hrithik Roshan Kaabil Vs Raeesషారుక్ ఖాన్ తమను మోసం చేశాడని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ సంచలన ఆరోపణలు చేసారు. నేడు షారూఖ్ ‘రయీస్’, హృతిక్ ‘కాబిల్’ విడుదలై, షారుక్ సినిమా కలెక్షన్స్ ముందు వరుసలో ఉన్న విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే షారుక్ సినిమా ‘రయీస్’ రంజాన్ కానుకగా విడుదల కావాల్సిన ఉండగా, సల్మాన్ ‘సుల్తాన్’ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కూడా అనేక వివిధ కారణాలతో ఈ సినిమా వాయిదాపడుతూ, చివరికి రిపబ్లిక్ డే బరిలో నిలిచింది.

అయితే హృతిక్ ‘కాబిల్’ మాత్రం ముందుగా అనుకున్న తేదీకే విడుదలైంది. ఈ నేపథ్యంలో ధియేటర్లను చేజిక్కించుకునేందుకు ‘రయీస్’ నిర్మాత షారూఖ్ ఖాన్, ‘కాబిల్’ నిర్మాత రాకేష్ రోషన్ తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. ఈ క్రమంలో ఎగ్జిబిటర్లు ఇబ్బందిలో పడగా, షారూఖ్ తో తాను 50:50 ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు. ఇది దేశ విదేశాల్లోని థియేటర్లకు కూడా వర్తించే విధంగా చర్చించుకున్నామని రాకేష్ తెలుపగా, చివరి నిముషంలో ఇందుకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు.

ADVERTISEMENT

షారుక్ ఎగ్జిబిటర్లను మేనేజ్ చేసి 60:40 శాతం ధియేటర్లను కేటాయించేలా చేశారని, దీంతో ‘రయీస్’ కంటే ‘కాబిల్’ తక్కువ ధియేటర్లలో విడుదలైందని, తద్వారా తమకు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా దేవుడు తమకు మంచే చేస్తాడని రాకేష్ రోషన్ అన్నారు. కలెక్షన్ల విషయంలో షారుక్ సినిమా ముందు వరుసలో ఉన్న మాట వాస్తవమే గానీ, రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి ఒకే విధమైన టాక్ లభించింది.

ADVERTISEMENT
Latest Stories