మనుషులకి ప్రాణం, జీవితం లెక్కలు వేర్వేరా?

Value of human life concept

ఇప్పుడు కుటుంబ సభ్యులని, కన్నబిడ్డలని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రోజూ వార్తలలో కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల విశాఖ తీరానికి సమీపంలో ఓ చేపల బోటు మునిగిపోగా, కర్రి చిన్న అనే ఓ జాలరి సముద్రంలో 18 గంటల పాటు ఈది ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటనలు ఒకే సమాజంలో జీవిస్తున్న మనుషుల ఆలోచనా విధానంలో వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఇదే వైరుధ్యం ప్రపంచ రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. ఇరాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు కనీస అవసరాల కోసం రోజూ పోరాడుతూ ఉంటారు. మరోవైపు ఆ దేశం అమెరికాతో యుద్ధం కోసం మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తూనే ఉంది. అదేవిధంగా అమెరికాతో సహా ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధం వలన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారీగా నష్టపోతూనే ఉన్నాయి.

ADVERTISEMENT

ఒకవైపు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, ఈ విధ్వంసం కోసం రెండు దేశాలు పోటాపోటీగా మిలియన్ల డాలర్లు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అంటే ప్రజల అవసరాల కంటే రాజకీయ ప్రతిష్ఠ, నేతల అహంకరానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం ఈ విషాదానికి కారణంగా కనిపిస్తోంది.

ఇది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పేదరికం, ఆకలి, అనారోగ్యంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా మన పొరుగు దేశాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ వంటివి పేదరికం, నిరుద్యోగంతో బాధపడుతున్నాయి.

కానీ ఆయా దేశాల పాలకుల ఆలోచనలు, ప్రాధాన్యతలు, చర్యలు అందుకు పూర్తి భిన్నంగా సాగుతుండటం కనిపిస్తూనే ఉంది.

ఈ ప్రపంచంలో కోట్లాది మంది దుర్భర పరిస్థితులలో కూడా జీవించాలని కోరుకుంటున్నారు. అలాగే వార్తలలో చూస్తున్నట్లు కొంత మంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటూ బలవంతంగా పలువురి ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఆర్దాంతరంగా తాము చనిపోతున్నారు.

కొందరికి ప్రాణాలు, జీవితం విలువ తెలుసు. కనుక కాపాడుకొని జీవించాలనుకుంటారు. వాటి విలువ తెలీని వారూ మన చుట్టూ ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారని వార్తలు చెపుతున్నాయి.

అయితే మనుషుల ఆలోచనలో ఈ వైరుద్యం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. కనుక అది కొందరికి మోదం కొందరికి ఖేదం మిగుల్చుతుంటుంది…. వారి ప్రమేయం లేకుండానే!

ADVERTISEMENT
Latest Stories