‘బేబీ కేర్ సెంటర్ల’ గురించి బహుశా తెలియని వారుండరు. ఉద్యోగాలు, చదువులు, ఇతరత్రా అవసరాల నిమిత్తం తమ పిల్లలను ‘బేబీ కేర్ సెంటర్’లో వదిలిపెట్టే వైనం పరిచయమైన అంశమే. అయితే తాజాగా “హస్బెండ్ కేర్ సెంటర్”లు కూడా దర్శమనమిస్తున్నాయి.
ADVERTISEMENT
“మీకంటూ సొంత సమయం కావాలా? షాపింగ్ కు వెళ్ళాలని ఉందా? మీ భర్తలను మా దగ్గర వదిలి పెట్టండి. మీరు ఫుడ్ కు, డ్రింక్స్ కు అయ్యే ఖర్చును మాత్రం చెల్లిస్తే చాలు” అన్న పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెళ్ళయిన తర్వాత మగ వారి దుస్తితి ఇంతకు చేరుకుంటుందని సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లకు కొదవలేదు. ఏమో భవిష్యత్తులో ఇవే మరింత పాపులర్ గా మారతాయేమో! ఎవరికి తెలుసు?
ADVERTISEMENT





