హైదరాబాద్ మెట్రో రైలును నడిపేది మహిళలు!

Hyderabad Metro Train women Driversట్రాఫిక్ కష్టాలతో నిత్యం ఇబ్బందులు పడే హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలుకు సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, నిర్మాణ సంస్థతో తలెత్తిన విభేదాలతో ఆలస్యమవుతూ వచ్చిన హైదరాబాద్ మెట్రో రైలు ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ఎన్నో అడ్డంకులను దాటి వచ్చిన ఈ మెట్రోకు సంబంధించిన ట్రయిల్ రన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

లీక్ అయిన ఈ మెట్రో రైల్ వీడియోలో స్పష్టమైన మరో స్పెషాలిటీ ఏమిటంటే… ఈ మెట్రోను ఓ మహిళ నడుపుతుండడం విశేషం. అంటే త్వరలో నగరవాసులకు అందుబాటులోకి రానున్న మెట్రోను మహిళలే డ్రైవ్ చేయబోతున్నారన్న మాట. డ్రైవింగ్ ఎవరు చేస్తే ఏముంది గానీ, ముందు మెట్రో రైలును అధికారికంగా ప్రారంభిస్తే చాలు అంటున్నారు హైదరాబాద్ వాసులు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ఓ అధికార తేదీని ప్రకటించాల్సి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories