రాజమౌళి చేత ‘శభాష్’ అనిపించుకున్న బన్నీ!

Hyderabad Traffic Police Allu Arjun SS Rajamouliవిద్యార్ధులలో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఆకట్టుకునే ప్రసంగాన్ని ఇచ్చాడు. మైక్ పట్టుకుని తొలుత కామెడీ చేస్తూ… ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్న తరుణంలో… క్లైమాక్స్ కు వచ్చేసరికి ఫుల్ సెంటిమెంట్ ను పండించి రాజమౌళి చేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. ప్రభుత్వం ఏదొక రూల్ పెడితే, మనం మారిపోతాము అనేది అమలుకు సాధ్యమయ్యే విషయం కాదు, అందుకే ఎవరికీ వారు ‘ఆత్మ పరిశోధన’ చేసుకోవాలని పిలుపునిచ్చాడు బన్నీ.

నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలంటే రాంగ్ రూట్ లో ఒక్క టర్న్ తిరిగితే సరిపోతుందని, కానీ తాను మాత్రం రెండు యూ టర్న్ లు తీసుకుని ఖచ్చితంగా రైట్ రూట్ లోనే వెళ్తానని, ఈ లోపున వాడేమో ఫోన్ చేసి ‘రారా బావ బీర్లు చల్లారిపోతున్నాయి’ అంటాడని చెప్తూ నవ్వేసాడు బన్నీ. ఇక రెండవ విషయం… మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దని చెప్పిన బన్నీ… మద్యం సేవించోద్దని మాత్రం తాను చెప్పనని, ఫ్రెండ్స్ బ్యాచ్ లో తాగని బోరింగ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు, వారికి డ్రైవింగ్ పోస్ట్ ఇవ్వండి, (నిజానికి వాళ్ళే మంచోళ్ళు) ఇలాంటివి వంద రకాల దారులు ఉంటాయి, వాటిని అనుసరించండి అంటూ చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

అత్యంత కీలకమైన మూడవ విషయం చెప్తూ… తాను 19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు తన స్నేహితురాలితో ఒక రెస్టారెంట్ లో వాగ్వివాదం జరిగిందని, తర్వాత ఆమె కారును చేజ్ చేసుకుంటూ చాలా స్పీడ్ లో వెళ్తున్నానని, అయితే ఒక ఏడెనిమిది అడుగుల దూరంలో ఓ కారుంది, అది ఒక్కసారిగా గమనించి సడెన్ బ్రేక్ వేసాను గానీ, అప్పటికి తన వెళ్లి డ్యాష్ ఇచ్చింది, అదృష్టవశాత్తు ఏం జరగలేదని, అయితే ఓ పెద్దాయన ఆ కారు డ్రైవింగ్ సీటు లోంచి దిగగా, తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పానని, కారుకు ఎంతయితే అంత బాగు చేయించి ఇస్తానని చెప్పినట్లుగా తెలిపాడు అల్లు అర్జున్.

ఇక్కడే ఓ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చాడు… అదే కారు వెనుక సీట్ లో నుండి డోర్ ఓపెన్ చేసుకుని ఓ గర్భిణితో ఉన్న మహిళ కిందకి దిగిందని, ఆమె తనను ఏమీ అనలేదు గానీ, తను చూసిన చూపులు తనను కదిలించాయని, ఆ సంఘటన తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని, డ్రైవ్ చేసేటప్పుడు మన జీవితం కాదు, మరొకరి జీవితం మన డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పిన స్పీచ్ కు విశేషమైన స్పందన లభించింది. ఆడిటోరియంలో ఉన్న విధ్యార్ధులతో పాటు పోలీసు అధికారులు, దర్శకధీరుడు రాజమౌళితో సహా అందరూ చప్పట్లతో అభివాదాలు పలికారు.

ఆ తర్వాత మైక్ అందుకున్న రాజమౌళి, మొదటి వ్యాఖ్యంతోనే బన్నీపై పంచ్ వేసాడు. చాలా ‘టచింగ్’ స్పీచ్ ఇచ్చావ్ బన్నీ… డైరెక్టర్ గా బాగా మాట్లాడలేను కాబట్టే హీరోలను సెలక్ట్ చేసుకుంటా… అంటూ ఓ పంచ్ వేసాడు జక్కన్న. ఆ తర్వాత తనదైన శైలిలో జక్కన్న ప్రసంగిస్తూ… ‘టెర్రరిస్ట్ ఎటాక్ లతో దేశంలో ఏడాదికి ఓ 200 మంది చనిపోతుండగా, ఈ యాక్సిడెంట్లతో మాత్రం ఒక లక్షా నలభై వేల మంది చనిపోతున్నారని, ఇవన్నీ తెలుసుకుని యువత ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories