టాలీవుడ్ తో పాటు యావత్ చిత్ర పరిశ్రమను వదల బొమ్మాలి అన్నట్టుగా వెంటాడి వేధిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకులు రవి ని ఎట్టకేలకు హైద్రాబాద్ పోలీసులు అరెస్టు చేసారు, అలాగే ఆయన చేతుల మీదుగానే ఐ బొమ్మ వెబ్ సైట్ ను సైతం మూయించారు.
అయితే రవి అరెస్టు పై, ఐ బొమ్మ మూసివేత పై టాలీవుడ్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ సైతం హర్షం వ్యక్తం చేసారు. పైరసీ చిత్ర పరిశ్రమకు ఒక పెను ముప్పుగా వాటిల్లిందని, దాన్ని అడ్డుకోవడం స్వాగతించదగ్గ పరిణామం అంటూ పేర్కొన్నారు పవన్.
ఒక సినిమాను కోట్లు వెచ్చించి తెరకెక్కించడం ఎంత కష్టంగా మారిందో అలాగే ఆ సినిమాను ఎటువంటి పైరసీ భూతం కంటపడకుండా వెండితెరమీద ఆవిష్కరించడం కూడా అంతే సాహసంగా మారిందంటూ టాలీవుడ్ గతంలోనే హైద్రాబాద్ సీపీ సజ్జనార్ ను ఆశ్రయించారు.
అయితే ఆయన చేపట్టిన ఐ బొమ్మ ఆపరేషన్ రవి అరెస్టు, వెబ్ సైట్ మూసివేతతో సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో సజ్జనార్ పై పలు రంగాల ప్రముఖుల నుంచి ప్రసంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఐ బొమ్మ రవి 110 డొమైన్ల సాయంతో 21 వేల చిత్రాలను అప్ లోడ్ చేసాడని, రవి అరేబియన్ దీవులలో సెయింట్ నేవి పొరసత్వం తీసుకుని పలు భాష చిత్రాలను పైరసి చేస్తూ వాటిని ఐ బొమ్మ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా అందరికి అందుబాటులో ఉంచుతూ కొన్ని లక్షల మంది డేటాను సేకరించినట్టు తెలిపారు.
ఐ బొమ్మ మూసివేత, దాని నిర్వాహకుడు రవి అరెస్టుతో టాలీవుడ్ కి ఇక పైరసీ ముప్పు తప్పినట్టేనా.? హైదరాబాద్ పోలీసుల దూకుడు ఇతర ఆన్ లైన్ వెబ్ సైట్ యజమాన్యాన్ని సైతం ఆలోచనలో పడేసే అవకాశం లేకపోలేదు.







