షరా మామూలే…ఈ వీకెండ్ కూడా…

Idam Jagath - Bluff Masterరెండు సినిమాలు…ఒకటి అక్కినేని సుమంత్ ఇదం జగత్…ఇంకొకటి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్…నిన్న రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు షరా మామూలుగా ప్రేక్షకులను నీరసాన్ని మిగిల్చాయి..

ఇందులో ముందుగా సుమంత్ నటించిన ఇదం జగత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..పచ్చిగా మాట్లాడుకుంటే సుమంత్ కి ఉన్న కాస్తో కూస్తో మార్కెట్ ఈ సినిమాతో ఖచ్చితంగా పోతుంది..అలా ఉంది సినిమా..
కధకు..స్క్రీన్ ప్లేకు ఏమాత్రం సంభంధం లేకుండా తెరకెక్కించి ఈ సినిమా..ఇక లాజిక్స్ అన్న పదానికి అర్ధమే మార్చేశారు..

ADVERTISEMENT

ఇక రెండో సినిమా బ్లఫ్ మాస్టర్..ఇది కాస్త బెటర్ సినిమా అనే చెప్పాలి..హీరో యాక్టింగ్ చాలా బావుంది..కథ కూడా అరువు తెచ్చిందే అయినప్పటికీ ఒక మోస్తరు వరకూ బాగానే డీల్ చేసాడు దర్శకుడు..కాకపోతే హీరోలో మార్పు వచ్చే టైంకి దర్శకుడు అలసి పోయి లైట్ తీసుకున్నట్లుగా తయారయ్యింది ప్రీ క్లయిమాక్స్…క్లైమాక్స్..

ADVERTISEMENT
Latest Stories