‘ఐమ్ గేమ్’ సినిమా రివ్యూ: చేజేతులా పాడుచేసుకున్న ఆట!

I’m Game Movie Review & Rating

చిత్రం: ఐమ్ గేమ్

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT

విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026

తారాగణం: దుల్కర్ సల్మాన్, కయాడు లోహార్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథ్ తదితరులు

నిర్మాణ సంస్థ: వేఫరార్ ఫిల్మ్స్

దర్శకత్వం: నహాస్ హిదయత్

సంగీతం: జేక్స్ బిజోయ్

నిర్మాత: దుల్కర్ సల్మాన్ – జామ్ వర్గీసీ

ఛాయాగ్రహణం: జిమ్షి ఖలీద్

కూర్పు: చమన్ చాకో

దుల్కర్ సల్మాన్ నటించి, నిర్మించిన తాజా చిత్రం “ఐమ్ గేమ్”. ఒక ఫాంటసీ ఎలిమెంట్ తో సాగే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెల కేరళ పండుగ ఓనం టైంలోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. కాస్త లేటుగా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. తెలుగు వెర్షన్ రిలీజ్ కి మాత్రం టైమ్ పట్టింది, నిన్న తెలుగు ప్రింట్స్ రాకపోవడంతో మలయాళం వెర్షన్ నిన్న రిలీజ్ అవ్వగా.. తెలుగు వెర్షన్ మాత్రం నేడు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ:

తండ్రి సంపాదించిన ఆస్తిని బెట్టింగుల మీద వృధా చేస్తూ.. జీవితాన్ని ఒక గోల్ లేకుండా గడిపేసే స్పాయిల్ట్ బ్రాట్ డేన్ (దుల్కర్ సల్మాన్). ఒక యాక్సిడెంట్ లో చేయి కోల్పోవడంతో.. అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వేరే వ్యక్తి కుడి చేయి డేన్ కి అతికిస్తారు. అప్పటినుండి అతడి చేయి అతడి కంట్రోల్లో ఉండదు, దాని వల్ల కొన్ని లాభాలు, ఎన్నో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
అసలు డేన్ కు అతికించిన చేయి ఎవరిది? అది ఎందుకని డేన్ ఆధీనంలో లేకుండా అతడ్ని ఇబ్బంది పెడుతుంది? ఆ కారణంగా అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వంటి ప్రశ్నలకి సమాధానమే “ఐమ్ గేమ్” చిత్రం.

నటీనటుల పనితీరు:

దుల్కర్ కి ఈ తరహా పాత్ర అనేది కొట్టిన పిండి. చాలా సునాయాసంగా పాత్రలో ఒదిగిపోయాడు. స్టైలిష్ లుక్స్ & బాడీ లాంగ్వేజ్ తో అలరించాడు. అయితే.. క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగా లేకపోవడం, సెకండాఫ్ లో అసలు క్యారెక్టరే కనిపించకపోవడం అనేది మైనస్.
మిస్కిన్ స్టైలిష్ విలన్ గా అలరించే ప్రయత్నం చేశాడు. అతడి పాత్రకు రిలేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ, ఫలానా నిజమైన వ్యక్తినీ అతడి పాత్రలో చూస్తారు ప్రేక్షకులు. ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి, దాన్ని చుట్టు నడిపే డ్రామా బాగున్నప్పటికీ.. ఆ పాత్ర యొక్క గోల్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల.. పేరుకి విలన్ అయినా.. విలనిజం కనిపించదు.
కయాడు లోహాన్, సంయుక్త విశ్వనాథ్ వంటి ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వాళ్లకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. చెరొక పాట, ఓ రెండు ఫైట్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా మిగిలిపోయారు.
ఆంటోనీ వర్గీసీ క్యారెక్టర్ కొత్తగా ఉన్నా.. అతడి పాత్ర ద్వారా కథకి కావాల్సిన ఎనర్జీ రాలేదు. అలాగే ట్విస్ట్ కూడా కొత్తగా లేకపోవడం అనేది మైనస్ గా నిలిచింది.

సాంకేతికవర్గం పనితీరు:

జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే కార్ చేజ్ సీక్వెన్స్ & సెల్ఫ్ ఫైటింగ్ సీన్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. ఆ రెండు బ్లాకులు మాత్రం ఏదో ఇంటర్నేషనల్ సినిమా చూస్తున్న భావన కలిగిస్తాయి. ఆ సీన్స్ కి కలరింగ్ & DI కూడా చాలా బాగుంది.

జేక్స్ బిజోయ్ ఎప్పట్లానే ఎలక్ట్రిక్ బీట్స్ & ఫ్యూజన్ మిక్స్ తో ర్యాంప్ ఆడించాడు. సన్నివేశంలో దమ్ము లేకపోయినా.. తన బిజీఎంతో ఎలివేట్ చేసేందుకు విశ్వప్రయత్నం చేశాడు.

దర్శకుడు నహాస్ హిదయత్ ఎంచుకున్న కథను ఆల్రెడీ కోకిల లాంటి తెలుగు సినిమాతోపాటు పార్ట్స్ అనే ఆంగ్ల సినిమాలోనూ చూసేశాం. అందువల్ల అదేమీ కొత్తగా కనిపించదు. పైగా.. ట్విస్ట్ అనేది చాలా రెగ్యులర్, ఇక సెకండాఫ్ ట్రీట్మెంట్ చాలా రొటీన్ అయిపోయింది. ఆ కారణంగా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. ఇక థీమ్ గా ఎంచుకున్న ఐపీఎల్ అనేది రిలవెంట్ గానే ఉన్నప్పటికీ.. దుల్కర్ సల్మాన్ కి లేనిపోని తలపోట్లు తెచ్చిపెట్టేలా ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఓడిపోయే టీమ్ ను మద్రాస్ టీమ్ గా చూపించడం అనేది చాలా రిస్కీ ఫీట్. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోనంతవరకు ఒకే కానీ.. ఎవరైనా పర్టిక్యులర్ గా హైలైట్ చేస్తే మాత్రం చాలా పెద్ద పెంట అవుతుంది. ఇక దర్శకుడిగా సన్నివేశాల కంపోజిషన్ వరకు నహాస్ పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. కథ-కథనాలను ఆసక్తిగా నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. అందువల్ల 173 నిమిషాల సినిమా బోర్ కొట్టించడమే కాక, సహనాన్ని పరీక్షిస్తుంది.

విశ్లేషణ:

ఫాంటసీ జానర్ లో ఉండే ఫ్రీడమ్ మరెందులోనూ ఉండదు. ఇష్టం వచ్చినట్లు ఎలాంటి లాజిక్ అవసరం లేకుండా సినిమాని నడిపించొచ్చు. అయితే.. లాజిక్ అవసరం లేకపోయినా మ్యాజిక్ చాలా అవసరం. సినిమా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయకపోతే మాత్రం ఎంత స్టైలిష్ గా తీసినా కష్టం, బడ్జెట్ మొత్తం వృధా అవుతుంది. “ఐమ్ గేమ్” సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. మంచి క్యాస్టింగ్, టెక్నికల్ గా స్ట్రాంగ్ టీమ్ & అవుట్ పుట్, కావాల్సినంత బడ్జెట్ వంటివన్నీ ఉన్నప్పటికీ.. కథ-కథనాలు ఆసక్తికరంగా లేకపోవడం, ట్విస్టులు ఆల్రెడీ ఊహించేవే కావడం, సెకండాఫ్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగడం వంటివి సినిమాకి నెగిటివ్ పాయింట్స్. దాంతో.. దుల్కర్ చాలా యాంబీషియస్ గా నిర్మించిన “ఐమ్ గేమ్” ఓ రొటీన్ & బీలో యావరేజ్ స్టైలిష్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా మిగిలిపోయింది.

ఓవరాల్ గా.. చేజేతులా పాడుచేసుకున్న ఆట!

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT
Latest Stories