పాకిస్తాన్ ను పడగొట్టిన ఇండియా!

india VS Pakisthan Hockey winsఓ పక్కన కోట్లాది మంది వీక్షిస్తున్న ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో క్రికెట్ ప్రేమికులంతా పూర్తి నిరాశలో మునిగిపోయారు. హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన ఇవ్వడం ఇటీవల కాలంలో ఇదే కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. కనీసం పోరాట పటిమ కూడా ప్రదర్శించకుండా 54 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోవడంతో… విరాట్ కోహ్లి తీసుకున్న బౌలింగ్ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది.

అయితే క్రికెట్ లో పాకిస్తాన్ ముందు తలవంచిన టీమిండియా, హాకీలో మాత్రం ఊరట చెందే విజయాన్ని సొంతం చేసుకుంది. లండన్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ లో పాకిస్తాన్ తో సెమీ ఫైనల్ లో తలపడ్డ ఇండియన్ జట్టు విజయం సాధించి, ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఏ సమయంలోనూ పాకిస్తాన్ కు అవకాశం ఇవ్వని ఇండియన్ ప్లేయర్లు, 7-1 తేడాతో విజయం సాధించి, క్రికెట్ మిగిల్చిన చేదు అనుభవాలకు కాస్త మందు వేసారు. ఎక్కడో చోట నెగ్గినందుకు ఇండియన్స్ కు ఉపశమనం లభించినట్లయ్యింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories