చేజింగ్ రికార్డ్… ఆసీస్ ను దాటిన టీమిండియా..!

India Vs West Indies t20 2018విండీస్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 3-0తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో… 182 పరుగుల లక్ష్యాన్ని అందుకుని టీమిండియా విక్టరీని సొంతం చేసుకుంది. దీంతో 180 కంటే ఎక్కువ సార్లు చేజింగ్ చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

[m9ad]

ADVERTISEMENT

టీ20లలో అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, విండీస్, టీమిండియా పేరిట ఉండగా, నాలుగు విజయాలతో ఉండగా, ఈ ఈ విజయంతో ఆ సంఖ్యను 5కు మెరుగుపరిచింది. అలాగే చివరి బంతికి విజయాన్ని దక్కించుకోవడం టీమిండియాకు ఇది మూడవసారి కాగా, ఈ విభాగంలో శ్రీలంక నాలుగు సార్లతో ముందంజలో ఉంది.

ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ వరుసగా 12 విజయాలను దక్కించుకుని, గతంలో కోహ్లి పేరుతో ఉన్న రికార్డును సమం చేసాడు. మొత్తమ్మీద విండీస్ తో జరిగిన టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ లను దిగ్విజయంగా టీమిండియా దక్కించుకుని, తమ ప్రభావాన్ని చాటుకుంది. జట్టులో కోహ్లి లేని ప్రభావం టీ20 సిరీస్ లో అస్సలు కనిపించకపోవడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories